Tv424x7
Andhrapradesh

బైరి నరేష్‌పై జరిగిన దాడిని ఖండిస్తూ మావోయిస్ట్ పార్టీ లేఖ

Mavoist: వరంగల్ : ఏటూరునాగారం బైరి నరేష్‌పై జరిగిన దాడిని మావోయిస్టు పార్టీ ఖండించింది. ఏటూరునాగారం-మహదేవపూర్ కమిటీ కార్యదర్శి సబిత పేరుతో మావోలు లేఖ విడుదల చేశారు..భీమకోరేగాం స్ఫూర్తి దినోత్సవం సందర్భంగా జరిపే సభకు హాజరైన బైరి నరేష్ పై బ్రాహ్మణీయ హిందుత్వ మతోన్మాదులు దాడి చేయడం అప్రజాస్వామికమని లేఖలో పేర్కొన్నారు. దాడి చేసిన వారిని వదిలిపెట్టి, దాడికి గురైన వారిపై పోలీసులు కేసు నమోదు చేశారన్నారు. ఇప్పటికైనా దాడి చేసిన వారిపై కేసులు నమోదు చేయాలని లేఖలో మావోలు డిమాండ్ చేశారు. పూజారి రాధాకృష్ణ సహా నాస్తికవాదులపై దాడి చేసిన వారిపై కేసులు పెట్టాలన్నారు. దళితులు, మైనార్టీలపై దాడులు ఆపకపోతే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరించింది..

Related posts

దక్షిణ వైసిపి శ్రేణులకు ప్రజలకు అండగా వాసుపల్లి

TV4-24X7 News

తల్లికి వందనం పథకం పూర్తిస్థాయిలో అమలు చేయకపోవడం కూటమి ప్రభుత్వానికి సిగ్గుచేటు : ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శి ఎద్దు రాహుల్, వీరపోగు రవి.

TV4-24X7 News

ఈనెల 10 వరకు సచివాలయాల్లో ఆన్ లైన్ సేవలు బంద్

TV4-24X7 News

Leave a Comment