Tv424x7
Andhrapradesh

రోల్‌ మోడల్‌గా ఆంధ్రప్రదేశ్‌: సీఎం జగన్‌

ఇతర రాష్ట్రాలకు రోల్‌ మోడల్‌గా ఆంధ్రప్రదేశ్‌: సీఎం జగన్‌

తాడేపల్లి: రాష్ట్రంలో ఎనిమిదో విడతలో జగనన్న తోడు పథకం కింద నిధులను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బటన్‌ నొక్కి విడుదల చేశారు. పూర్తి వడ్డీ భారాన్ని ప్రభుత్వమే భరిస్తూ 3,95,000 మందికి ఒక్కొక్కరికి రూ. 10 వేలు, అంతకుపైన కలిపి రూ. 417.94 కోట్ల వడ్డీ లేని కొత్త రుణాలు సీఎం జగన్‌ ప్రభుత్వం అందిస్తోంది. మొత్తం 16,73,576 మంది లబ్ధిదారుల్లో ఈ విడతలో వడ్డీ రీయింబర్స్‌మెంట్‌ కింద 5.81 లక్షల మంది లబ్ధిదారులకు రూ.13.64 కోట్లు చెల్లించనున్నారు. ఈ రెండూ కలిపి మొత్తం రూ.431.58 కోట్లను లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు.ఈ సందర్బంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ..’మన ప్రభుత్వం మానవత్వానికి మారుపేరుగా నిలబడింది. రాష్ట్రంలో 3.95 లక్షల మంది చిరు వ్యాపారులకు రూ.417.94 కోట్ల వడ్డీలేని రుణాలు. నాలుగున్నరేళ్లలో గొప్ప అడుగులు పడ్డాయి. ఈ పథకం ద్వారా చిరు వ్యాపారులు నాలుగు సార్లు లబ్ధి పొందారు. చిరు వ్యాపారులకు ఈ పథకంతో ఎంతో మేలు జరిగింది. ఈ పథకం ద్వారా లబ్ధి పొందే వారిలో దాదాపు 87 శాతం మహిళలే ఉన్నారు. ఇది మరో మహిళా సాధికారతకు నిదర్శనం.

Related posts

రివాల్వర్ తో ఆత్మహత్య చేసుకున్న తణుకు ఎస్సై కుటుంబానికి …రూ.45.68 లక్షల సాయం చేసిన అతని స్నేహితులు

TV4-24X7 News

దళిత విద్యార్థి జేమ్స్ పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం

TV4-24X7 News

31 వ వార్డు లో టి.డి.పి సభ్యత్వ నమోదు కార్యక్రమం

TV4-24X7 News

Leave a Comment