Tv424x7
Andhrapradesh

గద్వాల జిల్లాలలో అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం

గద్వాల జిల్లా:జనవరి 13జోగులాంబ గద్వాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత హైదరాబాద్‌ నుంచి చిత్తూరు వెళ్తున్న ఓ ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు 44వ జాతీయ రహదారిపై ఎర్రవల్లి చౌరస్తా సమీపంలో అదుపుతప్పి బోల్తా పడిందిదీంతో బస్సులో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదం లో ఓ మహిళ సజీవ దహనమైంది. మంటల్లో చిక్కుకుని మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు.సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానికులతో కలిసి సహాయక చర్యలు చేపట్టారు.గాయపడినవారిని కర్నూలు ప్రభుత్వ దవాఖానకు తర లించారు. బస్సు మియా పూర్‌ నుంచి చిత్తూరు వెళ్తున్నదని చెప్పారు. ప్రమాద సమయంలో బస్సులో 32 మంది ఉన్నారని తెలిపారు.డ్రైవర్‌ నిద్రమత్తు వల్లే ఈ ఘటన జరిగినట్లు ప్రాథమిక నిర్ధారించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

Related posts

టీడీపీ అధినేతపై ఏపీ సీఈవో మీనా సీరియస్‌.. కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు!

TV4-24X7 News

ఇద్దరు విద్యార్థులు కొట్టుకున్న ఘర్షణలో :ఒకరు మృతి

TV4-24X7 News

పేద‌ల బియ్యం ప‌క్క‌దారి ప‌ట్ట‌కుండా ప‌టిష్ట నిఘా..

TV4-24X7 News

Leave a Comment