Tv424x7
Andhrapradesh

ప్రపంచం గర్వించదగిన రీతిలో అంబేద్కర్‌ విగ్రహం: మంత్రి మేరుగ

AP: విజయవాడ: ప్రపంచం గర్వించదగిన రీతిలో అంబేద్కర్‌ విగ్రహం మన రాష్ట్రంలో ఏర్పాటైందని మంత్రి మేరుగ నాగార్జున అన్నారు. ఈనెల 19వ తేదీన విగ్రహం ఆవిష్కరణ వైభవంగా నిర్వహిస్తామన్నారు..తుమ్మలపల్లి క్షేత్రయ్యవారి కళాక్షేత్రంలో డా.బీ.ఆర్‌ అంబేద్కర్ రాష్ట్రస్థాయి సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి ఆదిమూలపు సురేష్, ఎమ్మెల్యే మల్లాది విష్ణు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మయన్మార్ నుంచి వచ్చిన బౌద్ధ భిక్షువులు ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించారు..సమాజంలో ఉన్న అసమానతలను తొలగించేందుకు కృషి చేసిన మహోన్నత వ్యక్తి అంబేద్కర్‌.. ఆయన భావజాలాన్ని భుజాన వేసుకుని పాలన చేస్తున్న ఒకే ఒక్కడు సీఎం జగన్‌ అని మంత్రి కొనియాడారు. అంబేద్కర్ ఆలోచనలతో పాలన చేస్తూ చరిత్ర పుటల్లో సీఎం జగన్‌ తన పేరు లిఖించుకున్నారన్నారు. సీఎం జగన్‌ భావితరాల భవిషత్తు కోసం పనిచేస్తున్నారని మంత్రి అన్నారు..

Related posts

రెడ్ బుక్ కేసు విచారణలో కీలక అప్ డేట్

TV4-24X7 News

వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ని పరిశీలిస్తున్న డీసీపీ -2 తుహిన్ సిన్హా

TV4-24X7 News

టీడీపీ కీలక నేతలతో టీడీపీ అధినేత చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్

TV4-24X7 News

Leave a Comment