Tv424x7
Andhrapradesh

నేడు శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోటా విడుదల

TTD: తిరుమల, న్యూస్‌టుడే: శ్రీవారి భక్తుల సౌకర్యార్థం ఏప్రిల్‌కు సంబంధించిన ఆర్జిత సేవలు, దర్శన టికెట్ల కోటాను తితిదే విడుదల చేయనుంది. సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళపాదపద్మారాధన ఆర్జిత సేవల ఆన్‌లైన్‌ లక్కీడిప్‌ కోసం ఈ నెల 18న గురువారం ఉదయం పది నుంచి 20వ తేదీ ఉదయం పది గంటల వరకు నమోదు చేసుకోవచ్చు..లక్కీడిప్‌ టికెట్లు పొందిన భక్తులు ఈ నెల 22న మధ్యాహ్నంలోపు రుసుం చెల్లించి వాటిని ఖరారు చేసుకోవాల్సి ఉంటుంది.ఈ నెల 22వ తేదీ ఉదయం 10 గంటలకు కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్‌సేవ, సహస్ర దీపాలంకార సేవ టికెట్లను ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు. వర్చువల్‌ సేవా టికెట్లను అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు అందుబాటులో ఉంచుతారు.శ్రీవారి వార్షిక వసంతోత్సవం ఏప్రిల్‌ 21 నుంచి 23వ తేదీ వరకు జరుగనుంది. ఇందుకు సంబంధించిన సేవా టికెట్లను ఈ నెల 22న ఉదయం పది గంటలకు విడుదల చేయనున్నారు.ఈ నెల 23వ తేదీ ఉదయం పది గంటలకు అంగప్రదక్షిణం టోకెన్ల కోటా..ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్టు బ్రేక్‌ దర్శనం, గదుల కోటాను విడుదల చేస్తారు. మధ్యాహ్నం మూడు గంటలకు వృద్ధులు, దివ్యాంగులకు దర్శన టోకెన్ల కోటాను అందుబాటులో ఉంచుతారు.ఈ నెల 24వ తేదీ ఉదయం పది గంటలకు ప్రత్యేక ప్రవేశ దర్శనం రూ.300 టికెట్ల కోటాను విడుదల చేస్తారు. మధ్యాహ్నం మూడు గంటలకు తిరుమల, తిరుపతిలో వసతి గదుల బుకింగ్‌కు వీలు కల్పించనున్నారు.ఏప్రిల్‌కు సంబంధించి జనవరి 27వ తేదీ ఉదయం 11 గంటలకు తిరుమల, తిరుపతికి చెందిన శ్రీవారి సేవా కోటాను, మధ్యాహ్నం 12 గంటలకు నవనీత సేవ కోటాను, ఒంటి గంటకు పరకామణి సేవా కోటాను విడుదల చేస్తారు. భక్తులు https://ttdevasthanams.ap.gov.in వెబ్‌సైట్‌లో టికెట్లను బుక్‌ చేసుకోవాలని తితిదే అధికారులు కోరారు..

Related posts

అనవసరంగా ఘర్షణలు చెయ్యవద్దు… ప్రోత్సహించవద్దు- ప్రొద్దుటూరు డిఎస్పి మురళీధర్

TV4-24X7 News

పెందుర్తి పలు ప్రాంతాల్లో శంకుస్థాపన చేయనున్న ఎమ్మెల్యే పంచకర్ల

TV4-24X7 News

ఏపీలో 35 లక్షల జాబ్ కార్డుల తొలగింపు

TV4-24X7 News

Leave a Comment