Tv424x7
Telangana

సీఎం రేవంత్‌ ఇంటికి సస్పెండైన ఆర్టీసీ ఉద్యోగులు

Hyderabad: హైదరాబాద్‌: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసేందుకు సస్పెండైన ఆర్టీసీ ఉద్యోగులు పెద్దఎత్తున హైదరాబాద్‌కు తరలివచ్చారు. జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసం వద్దకు వచ్చిన వారిని పోలీసులు అడ్డుకున్నారు..గత ప్రభుత్వంలో తమకు అన్యాయం జరిగిందని, తమ గోడును సీఎంకు విన్నవించుకునేందుకు వచ్చినట్లు తెలిపారు. చిన్నచిన్న కారణాలతో 1500 మందిని ఉద్యోగాల నుంచి తీసివేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తమను విధుల్లోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. సీఎంను కలిసి వినతిపత్రం ఇచ్చేందుకు ముగ్గురికి పోలీసులు అనుమతి ఇచ్చారు..

Related posts

తెలంగాణ TSLPRB 118 APP పోస్టులకు దరఖాస్తుల చివరి తేదీ పొడిగింపు!

TV4-24X7 News

తెలంగాణ/ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాలకు వాతావరణ హెచ్చరిక!!

TV4-24X7 News

పెద్దపల్లి నియోజకవర్గంలో అకాల వర్షం: వరి పంట వాలు, రైతులు తీవ్ర ఆందోళనలో

TV4-24X7 News

Leave a Comment