అమరావతి: సీఎం జగన్.. ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ ఆసుపత్రులకు దాదాపు రూ.1200 కోట్లు బకాయి పెట్టడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయాయని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ధ్వజమెత్తారు..అస్తవ్యస్త పాలనతో రాష్ట్ర ఖజానాను ఖాళీ చేశారని విమర్శించారు. సీఎం సొంత జిల్లా కడపలో సైతం ఆసుపత్రుల యాజమాన్యాలు సేవలు నిలిపివేయడంతో పేదోళ్లకు వైద్యం గాల్లో దీపంలా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు..బకాయిలు విడుదల చేసి సమస్యను పరిష్కరించడంలో చొరవచూపని ప్రభుత్వం.. ఆసుపత్రులను డీలిస్ట్ చేస్తూ బెదిరింపులకు దిగడం దారుణమని మండిపడ్డారు. అత్యవసరమైన వైద్య సేవల విషయంలో ప్రభుత్వ నిర్లక్ష్యానికి అమాయకులను బలిపశువులుగా మార్చొద్దని హితవు పలికారు. లక్షలాది పేద ప్రజల ఆరోగ్య సేవల విషయంలో మొండి వైఖరి వీడి సమస్యను సామరస్యంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు

previous post