Tv424x7
Andhrapradesh

తెదేపా నుంచి వైకాపాలో చేరిన ఎమ్మెల్యేలకు నోటీసులు

అమరావతి: తెదేపా (TDP) నుంచి వైకాపా (YSRCP)లో చేరిన నలుగురు ఎమ్మెల్యేలకు శాసనసభ కార్యదర్శి నోటీసులు జారీ చేశారు. ఎమ్మెల్యేలు కరణం బలరాం, మద్దాల గిరి, వాసుపల్లి గణేశ్‌, వల్లభనేని వంశీ ఈనెల 29న మధ్యాహ్నం విచారణకు హాజరై వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు..పార్టీ మారిన నలుగురు ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని పార్టీ విప్‌ డోలా బాలవీరాంజనేయస్వామి పిటిషన్‌ వేశారు. తెలుగుదేశం పార్టీ నిర్ణయం మేరకే పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్‌ ఇచ్చామని, వారిపై చర్యలు తీసుకోవాలని అధినేత చంద్రబాబు (Chandrababu) తన అభిప్రాయాన్ని ఇప్పటికే స్పీకర్‌కు తెలియజేశారు..

Related posts

ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో అంతులేని నిర్లక్ష్యం.. విద్యార్థిని అదృశ్యం

TV4-24X7 News

ఆటో డ్రైవర్లకు సీఎం చంద్రబాబు శుభవార్త..ఏంటో తెలుసా

TV4-24X7 News

ప్రజలకు రేషన్ బియ్యం సక్రమంగా అందించాలి : తహశీల్దార్లు వెంకటసు బ్బయ్య

TV4-24X7 News

Leave a Comment