Tv424x7
Andhrapradesh

బద్వేల్ మండలంలో సత్రం స్థలం కబ్జా ఆరోపణలు.. మాజీ సర్పంచ్‌పై ఫిర్యాదు..!

వైఎస్సార్ కడప జిల్లా బద్వేల్ మండలం బయనపల్లె సమీపంలో కోట్ల విలువైన సత్రం స్థలం కబ్జా వ్యవహారం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. చింతలచెరువు గ్రామానికి చెందిన మంగతాయమ్మ ప్రజా అవసరాల కోసం నిర్మించిన సత్రానికి చెందిన సుమారు రూ.3 కోట్ల విలువైన స్థలాన్ని టిడిపి మాజీ సర్పంచ్ సుబ్బారెడ్డి కబ్జా చేశారంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.స్థలంలో ఉన్న దిగుడు బావి, సమాధులను ధ్వంసం చేసి గదులు నిర్మించి వాటిని అద్దెకు ఇచ్చినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా రీ-సర్వేలో సత్రం స్థలాన్ని వేరే ప్రాంతంగా చూపించారని రెవెన్యూ అధికారులపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.ఈ వ్యవహారంపై చింతలచెరువు గ్రామానికి చెందిన టిడిపి నాయకుడు బీజీ వేముల రమణారెడ్డి జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరిపి నిజానిజాలు వెలికి తీయాలని స్థానికులు కోరుతున్నారు.గమనిక: ఇవి ఫిర్యాదులు, ఆరోపణల ఆధారంగా వచ్చిన సమాచారం మాత్రమే. అధికారుల విచారణ అనంతరం పూర్తి వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

Related posts

అక్రమ ఇసుక రవాణాపై విజిలెన్స్ దాడులు

TV4-24X7 News

ఏపీలో ఆరోగ్యశ్రీ కింద రూ.25 లక్షల వైద్య సాయం: మంత్రి సత్యకుమార్

TV4-24X7 News

వైసీపీ కార్యకర్తలపై లాఠీచార్జ్…

TV4-24X7 News

Leave a Comment