Tv424x7
Andhrapradesh

కడప జిల్లా రాజంపేట మన్నూరులో భారీ అగ్నిప్రమాదం

కడప జిల్లా రాజంపేట మన్నూరులో భారీ అగ్నిప్రమాదం కలకలం రేపింది. మన్నూరు ప్రాంతంలోని మసీద్ కాంప్లెక్స్లో ఉన్న రెండు దుకాణాలు అగ్నికి ఆహుతయ్యాయి. పెయింట్ షాప్, ఎలక్ట్రికల్ షాప్ పూర్తిగా దగ్ధమైనట్లు సమాచారం.“ఆల్ అమీన్ ట్రేడర్స్”లో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. వెల్డింగ్ పనుల సమయంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగి ఉండొచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నప్పటికీ, అధికారికంగా నిర్ధారణ కాలేదు.ఈ ప్రమాదంలో భారీ మొత్తంలో సామగ్రి కాలిపోయినట్లు సమాచారం. సుమారు రూ.30 లక్షల మేర ఆస్తి నష్టం జరిగి ఉండొచ్చని ప్రాథమిక అంచనాలు చెబుతున్నాయి.సమాచారం అందుకున్న వెంటనే స్థానికులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యల్లో పాల్గొన్నారు. భారీగా ఎగిసిపడ్డ మంటలతో ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.ఘటనపై సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది వెంటనే స్పందించి మంటలను అదుపులోకి తీసుకువచ్చే ప్రయత్నాలు చేపట్టారు. అగ్నిప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు, నష్టం వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

మీ సమీపంలోని సమస్యలు మాకు పంపాలనుకుంటే మా మొబైల్ నెంబర్ : 8686186039

Related posts

తాడేపల్లిలో వైయస్ జగన్మోహన్ రెడ్డి మహర్షి వాల్మీకి జయంతి సందర్భంగా పుష్పాంజలి ఘటించారు..

TV4-24X7 News

వలస కార్మిక కుటుంబం ఆత్మహత్యాయత్నం: తల్లి, పాప మృతి

TV4-24X7 News

ఏపీలో క్వాంటమ్‌ భవనం.. ఆకృతి సిద్ధం!!

TV4-24X7 News

Leave a Comment