Tv424x7
Andhrapradesh

ఏపీలో క్వాంటమ్‌ భవనం.. ఆకృతి సిద్ధం!!


అమరావతిలో క్వాంటమ్‌ వ్యాలీ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌లో భాగంగా నిర్మించనున్న ఐకానిక్‌ భవనం నమూనా ఖరారైంది. వ్యాలీలోకి ప్రధాన ద్వారంలా నిలిచే ఈ భవనాన్ని ‘అమరావతి ఆకృతి’ ప్రతిరూపంలా తీర్చిదిద్దారు.

భవనం ఇరువైపులా నాలుగేసి భారీ టవర్లు నిర్మించేందుకు డిజైన్‌ సిద్ధమైంది. ఆధునిక సాంకేతికత, విశిష్ట శిల్పకళ కలయికగా ఉండే ఈ కట్టడం, భవిష్యత్‌ సాంకేతిక కేంద్రానికి ప్రతీకగా నిలవనుందని అధికారులు తెలిపారు.

🔹 త్వరలో టెండర్‌ ప్రక్రియ పూర్తయ్యాక నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి.
🔹 క్వాంటమ్‌ వ్యాలీని ప్రపంచ స్థాయి ఇన్నోవేషన్‌ హబ్‌గా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.

ఈ ప్రాజెక్ట్‌ వల్ల రాష్ట్రానికి పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు పెరిగే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Related posts

చట్నీ విషయములో గొడవ భార్య ఆత్మహత్య

TV4-24X7 News

స్థానిక ప్రజలకు సైబర్ నేరాలు పై అవగాహన ఎంవీపీ సీఐ మురళి

TV4-24X7 News

ఉచితంగా బీఎస్ఎన్ఎల్ 4జీ సిమ్ కార్డులు

TV4-24X7 News

Leave a Comment