కడప/ కాశినాయన :కూటమి ప్రభుత్వం ఎండియు వ్యవస్థ ను రద్దుచేసి డీలర్ వ్యవస్థను పునరుద్ధరణ చేశారని జూన్1వతేదీ నుండిప్రజలకు అందుబాటులో ఉంటూ సక్రమంగా నిత్యావసర వస్తువుల ను అందించాలని కాశినాయన మండల తహశీల్దార్లు వెంకటసుబ్బయ్య పేర్కొన్నారు. శనివారం కాశినాయన మండల తహశీల్దార్ కార్యాలయం లో డీలర్లతో ప్రత్యేక సమావేశం అయ్యారు. ఈసంద ర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభు త్వము ప్రజలకు మంచి సేవలు అందించేందుకు డీలర్ వ్యవస్థను మళ్ళీ తెచ్చారని,ఎలాంటి అవకత వకలు చేయకుండా ప్రతి ఒక్కరికి పంపిణీ చేసి మంచి పేరు తెచ్చుకో వాలన్నారు.ఉదయం8గంటలనుండీ మధ్యాహ్నం12 గంటలు,సాయం త్రం 4 గంటల నుండి 8 గంటల వర కుపంపిణీచేయాలనికోరారు.ప్రభుత్వ నిబంధనల ప్రకారమే పంపిణీ చేయాలని కోరారు.ఈకార్యక్రమంలో ఆర్.ఐ అమర్నాథరెడ్డి, డీలర్లు పాల్గొన్నారు.

