Tv424x7
Andhrapradesh

అంగన్వాడీ లబ్ధిదారులకు సంతోషకరమైన వార్త….

అమరావతి:

అంగన్వాడీ కేంద్రాల లబ్ధిదారులకు ఇకపై పెద్ద సౌకర్యం లభించనుంది. ఇప్పటివరకు లబ్ధిదారులు తమ గ్రామంలోని కేంద్రాల్లో మాత్రమే పోషణ సరుకులు పొందేవారు. వలస వెళ్ళినా, సరుకులు ఇచ్చే సమయంలో హాజరుకాలేకపోయినా ఆ నెల సరుకులు దక్కకపోవడంతో ఇబ్బందులు ఎదురయ్యేవి.

ఈ సమస్యలకు శాశ్వత పరిష్కారంగా కేంద్ర ప్రభుత్వం ‘పోషణ్ ట్రాకర్ యాప్’ లో కొత్తగా ‘మైగ్రేషన్ ఆప్షన్’ ను జోడించింది. దీని ద్వారా లబ్ధిదారులు ఎక్కడ ఉన్నా, దగ్గరలోని ఏ అంగన్వాడీ కేంద్రం నుంచైనా సరుకులు పొందే అవకాశం కల్పించారు.

🔹 ఈ కొత్త సదుపాయం ద్వారా గ్రామీణ, పట్టణ ప్రాంతాల మధ్య వలస వెళ్ళే కార్మికులు, గర్భిణీలు, బాలింతలు, చిన్నారులు ఇకపై పోషణ సరుకుల కోసం ఇబ్బందులు పడాల్సిన అవసరం ఉండదు.

👉 లబ్ధిదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

అనూష

Related posts

కౌంటింగ్ కేంద్రాల్లో హైస్పీడ్ ఇంటర్నెట్: సీఈవో ముకేశ్

TV4-24X7 News

రేపు ఎంపీడీవో సభా భవనం నందు వాలంటీర్ల సన్మానము

TV4-24X7 News

జగన్ అనర్హతపై అయ్యన్న, రఘురామ తాజా వ్యాఖ్యలు !

TV4-24X7 News

Leave a Comment