కడప: జిల్లాలో మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి కాంగ్రెస్లో చేరుతారనే వార్త జిల్లాలో జోరందుకుంది. త్వరలో జిల్లాలో ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల పర్యటన నేపథ్యంలో ఈ వార్తకు మరింత బలం చేకూరుతుంది. 2014 వరకు కాంగ్రెస్లో పని చేసిన ఆయన చివరగా కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో మంత్రిగా వ్యవహరించారు. 2019 ఎన్నికల్లో వైసీపీకి దగ్గరయ్యారు. కొంత కాలంగా జగన్ ప్రభుత్వంపైన డీఎల్ విమర్శలు గుప్పిస్తూ వస్తున్నారు.
