Tv424x7
Andhrapradesh

పశ్చిమగోదావరి జిల్లాలో భారీగా బంగారం స్వాధీనం

ప” గోదావరి జిల్లా /ఫిబ్రవరి01:-ఎటువంటి బిల్లులు లేకుండా 6 కేజీలకు పైగా బంగారం తరలిస్తున్న 10 మంది ముఠా సభ్యులను పశ్చిమగోదావరి జిల్లాలోని భీమవరం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.ఈ బంగారం విలువ రూ.3.85 కోట్లు ఉంటుందని పోలీసులు అంచనా వేశారు. భీమవరంలో గురువారం మధ్యాహ్నం పోలీసులు తనిఖీలు నిర్వహించారు.కారు అనుమానాస్పదంగా ఉండటంతో సోదాలు చేశారు. ఈ సోదాల్లో 6 కేజీలకు పైగా బంగారం తరలిస్తున్నట్లు గుర్తించారు.బిల్లులు చూపకపోవడంతో 10 మందిని అదుపులోకి తీసుకుని విచారించారు. అయితే ఈ బంగారం ఎక్కడి నుంచి తెస్తున్నారు.. ఎవరికి ఇస్తున్నారనే విషయాలు మాత్రం బయటకు రాలేదు.నిందితులు ఎలాంటి విషయాలు చెప్పలేదని పోలీసులు తెలిపారు. మరోవైపు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు..

Related posts

కస్టమర్లను పట్టించుకోని బ్యాంకు అధికారులు

TV4-24X7 News

బిజెపి నాయకులకు ఘనంగా సన్మానం

TV4-24X7 News

21వ వార్డులో ఫ్రైడే డ్రై డే కార్యక్రమం

TV4-24X7 News

Leave a Comment