Tv424x7
Andhrapradesh

ఆంధ్రప్రదేశ్ అప్పులు ఆపకుంటే మరో శ్రీలంక పాకిస్తాన్ అవ్వడం ఖాయం : కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్

ఆంధ్రప్రదేశ్లో జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రాన్ని తీవ్రంగా అప్పులు పాలు చేసిందని ప్రతిపక్షాలు ఆర్థిక నిపుణులు విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే.ఈ అప్పులకి అడ్డుకట్ట వేయకపోతే ఏపీ కూడా ఇంకో శ్రీలంక పాకిస్తాన్ల మారిపోతుందని హెచ్చరిస్తున్నారు. ఏపీ ప్రభుత్వం మాత్రం తాము కేంద్రం ఆర్బీఐ నిబంధనలకు లోబడే అప్పులు చేస్తున్నామని చెప్తోంది. టీడీపీ ప్రభుత్వమే తమకంటే ఎక్కువ అప్పులు చేసిందని చెప్తోంది ప్రభుత్వం.ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వానికి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ షాక్ ఇచ్చారు ఆంధ్ర ప్రదేశ్ ఆర్థిక పరిస్థితుల మీద రాష్ట్ర ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు సూచనలు సలహాలు హెచ్చరికలు జారీ చేస్తున్నామని నిర్మల సీతారామన్ అన్నారు. తాజా పార్లమెంట్ సమావేశంలో భాగంగా టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు అడిగిన ప్రశ్నకి నిర్మల సీతారామన్ సమాధానం చెప్పారు. ఆంధ్ర ప్రదేశ్ ఆర్థిక పరిస్థితుల మీద రాష్ట్ర ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు సూచనలు సలహాలు హెచ్చరికలు జారీ చేస్తున్నట్టు ఆమె అన్నారు.

Related posts

సుపారీ ఇచ్చి తండ్రినే చంప్పించిన కూతురు

TV4-24X7 News

ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలోబంద్ జయప్రదం:-బ్రహ్మంగారిమఠం

TV4-24X7 News

గుడ్డ సంచులను వాడండి- పర్యావరణాన్ని కాపాడండి అని తెలుపుతూ గుడ్డ సంచులను ప్రారంభించిన ఎమ్మెల్యే వంశీకృష్ణ

TV4-24X7 News

Leave a Comment