Tv424x7
Andhrapradesh

ఇద్దరు విద్యార్థులు కొట్టుకున్న ఘర్షణలో :ఒకరు మృతి

నిర్మల్ జిల్లా:ఫిబ్రవరి 9నిర్మల్ జిల్లాలోని సారంగాపూర్ మండలం చించోలి బి గ్రామం వద్ద గల మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలలో ఇద్దరు టెన్త్ విద్యార్థుల మధ్య గురువారం రాత్రి ఘర్షణ జరిగింది.ఇద్దరు విద్యార్థులు గొడవ పడడంతో అర్బాజ్ (15) అనే విద్యార్థి అక్కడికక్కడే మృతి చెందాడు. విద్యార్థి మృతదేహాన్ని ఈరోజు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.విషయం తెలుసుకున్న పోలీసులు పాఠశాలకు వెళ్లి వివరాలు సేకరించారు.ఈ విషయం తెలుసుకున్న మృతుని బంధువులు, స్నేహితులు ఆసుపత్రి వద్ద ఆందోళన చేశారు.బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, తమ కుటుంబంలో ఇద్దరు పిల్లలకు ఉద్యోగం ఇవ్వాలని, రూ.25 లక్షల పరిహారంతో పాటు నిందితున్ని కఠినంగా శిక్షించే వరకు వెళ్లేది లేదని ఆస్పత్రి వద్ద ఆందోళన చేశారు.దీంతో నిర్మల్ ఆర్డీవో ప్రభుత్వ ఏరియా ఆసు పత్రికి చేరుకొని బాధిత కుటుంబాలకు భరోసా ఇచ్చారు. ఈవిషయం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగేలా చేస్తానని చెప్పడంతో ఆందోళన విరమించారు…

Related posts

కృష్ణమ్మ పరవళ్లు, శ్రీశైలం జలాశయానికి వరద

TV4-24X7 News

దసరా ఉత్సవాలు రాట ముహర్తం కార్యక్రమం లో పాల్గొన్న విల్లూరి

TV4-24X7 News

ఉరికిటి గణేష్ ఆద్వర్యం లో టి.డి.పి సభ్యత్వం నమోదు కార్యక్రమం

TV4-24X7 News

Leave a Comment