Tv424x7
AndhrapradeshTelangana

కృష్ణమ్మ పరవళ్లు, శ్రీశైలం జలాశయానికి వరద

శ్రీశైలం: నైరుతి రుతుపవనాల రాకతో రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. ఎగువ పరీవాహక ప్రాంతాల నుంచి శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. జూరాల ప్రాజెక్టు నుంచి 88,835 క్యూసెక్కులు, సుంకేశుల జలాశయం నుంచి 8,824 క్యూసెక్కుల వరద వస్తోంది. శ్రీశైలం జలాశయం నీటిమట్టం శుక్రవారం ఉదయం 6 గంటల సమయానికి 818.20 అడుగులుగా ఉంది. నీటి నిల్వ 39.5529 టీఎంసీలుగా నమోదైంది. జోగులాంబ గద్వాల జిల్లాలోని జూరాల ప్రాజెక్టు కు వరద పోటెత్తింది. వరద ప్రవాహం మొదలైన 8 గంటల్లోనే నీటిమట్టం గరిష్ఠ స్థాయికి చేరుకుంది. రాత్రి 7 గంటలకు లక్ష క్యూసెక్కుల వరద వచ్చి చేరింది. దీంతో ప్రాజెక్టు 12 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఇక జూరాల నుంచి కృష్ణమ్మ పరుగులు పెట్టడంతో.. శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతుంది.

Related posts

5.3 కోట్ల మోసం కేసులో ఐఆర్డీఏఐ అసిస్టెంట్ మేనేజర్ అరెస్టు..

TV4-24X7 News

ఆ నగర వాసులకు ముఖ్య సమాచారం – నీటి సరఫరా నిలిపివేత

TV4-24X7 News

తిరుమలకు ఎన్డీబీ ల్యాబ్ పరికరాలు

TV4-24X7 News

Leave a Comment