Tv424x7
Telangana

నల్గొండలో బీఆర్ఎస్ సభ.. రైతు గర్జన సభకు కేసీఆర్

హైద్రరాబాద్.తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత గులాబీ బాస్ కేసీఆర్‌ తొలిసారి జనం మధ్యలోకి రాబోతున్నారు. నల్లగొండ జిల్లా కేంద్రంలోని మర్రిగూడ బైపాస్‌ రోడ్డులోని 50 ఎకరాల స్థలంలో ఇవాళ మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు రైతు గర్జన పేరుతో బీఆర్‌ఎస్‌ బహిరంగసభ నిర్వహిస్తుంది..కృష్ణానదిపై ఉన్న ఉమ్మడి ప్రాజెక్టులను కేంద్ర సర్కార్ కు అప్పగించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని ఈ సభ ద్వారా కేసీఆర్ ఎండగట్టాలని చూస్తున్నారు. కేఆర్‌ఎంబీకి ప్రాజెక్టులు అప్పగించేది లేదని రాష్ట్ర ప్రభుత్వం నిన్న (ఫిబ్రవరి 12) అసెంబ్లీలో తీర్మానం చేసిన నేపథ్యంలో కేసీఆర్‌ ఎలా స్పందించనున్నారు అనేది చూడాలి. 6 నెలల్లోగా నదీ జలాల పంపకం పూర్తి చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నల్లగొండ సభా వేదికగా గులాబీ దళపతి అల్టిమేటం జారీ చేసే ఛాన్స్ ఉంది..

Related posts

తెలంగాణ హైకోర్టుకు ఇద్దరు కొత్త న్యాయమూర్తులు

TV4-24X7 News

దివ్యాంగుల రిజర్వేషన్‌పై: ప్రభుత్వం కీలక నిర్ణయం

TV4-24X7 News

తిరుమలలో మనమడి గుండు మొక్కు తీర్చుకున్న సీఎం రేవంత్ రెడ్డి

TV4-24X7 News

Leave a Comment