Tv424x7
Andhrapradesh

ప్రత్యేక హోదా కాంగ్రెస్ తోనే సాధ్యం- ఆళ్లగడ్డ కాంగ్రెస్ ఇంచార్జి చాకలి పుల్లయ్య

కాంగ్రెస్ పార్టీని ఆదరించి గెలిపించాలని ప్రజల్ని ఆళ్లగడ్డ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ చాకలి పుల్లయ్య కోరారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా నేటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికార ప్రతిపక్ష పార్టీలు ప్రజల పట్ల వ్యవహరిస్తున్న పరిపాలన తీరుపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.40 సంవత్సరాలకు పైగా రాజకీయ అనుభవంలో ఒకరినొకరు కేవలం వ్యక్తిగత దూషణలు , విమర్శలతో రాష్ట్ర అభివృద్ధిని విస్మరించి ఉచిత పథకాల పేరుతో ప్రజల్ని నాశనం చేసిన ఘనత దేశంలో ఏ రాష్ట్రాల్లో లేని విధంగా రాష్ట్ర అధికార , ప్రతిపక్ష పార్టీల సొంతమని ఏద్దేవ చేశారు. రాష్ట్ర విభజన అనే సున్నితమైన అంశాన్ని ఆసరాగా చేసుకొని కేంద్ర భారతీయ జనతా పార్టీ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ , వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీలు ప్రజల్ని మోసం చేసిన తీరును వివరించారు. రాష్ట్రానికి ప్రత్యేక హెూదా ఇస్తామన్న బీజేపీ ఇవ్వకుండా మోసం చేస్తే రాష్ట్రా అధికార మరియు ప్రతిపక్ష పార్టీలైన టీడీపీ వైసీపీ ప్రత్యేక హెూదా సాధించడం కోసం కేంద్రంతో పోరాడకుండా కేసులకు భయపడి ఒకరి తర్వాత మరొకరు ప్రత్యేక విమానాలు వేసుకొని మరీ మోదీ కాళ్ళ మీద పడి రాష్ట్ర ప్రజల భవిష్యత్ను అలాగా ఆత్మగౌరవాని మంటగలుపుతున్న తీరు హేయమని పుల్లయ్య దుయ్యబట్టారు.

Related posts

తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం

TV4-24X7 News

ఎస్సీ కార్పోరేషన్ రుణాలు సైట్ ఆన్ లైన్ ప్రారంభం

TV4-24X7 News

రాష్ట్రంలో పాలన, పోలీస్ వ్యవస్థ ఉందా? లేదా?: మాజీమంత్రి ప్రత్తిపాటి

TV4-24X7 News

Leave a Comment