గూడూరు: మహబూబాబాద్ జిల్లా గూడూరులో దారుణం జరిగింది. రెండు కుటుంబాల మధ్య గొడవల నేపథ్యంలో తల్లి, కుమారుడు దారుణహత్యకు గురయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..సమ్మన్న కుటుంబం గత కొన్నేళ్లుగా చేతబడులు చేస్తుందనే నెపంతో కుమారస్వామి కుటుంబం వారితో గొడవలు పడుతోంది. ఇరుకుటుంబాలపై పోలీస్ స్టేషన్‌లో కేసులు నమోదయ్యాయి. ఈక్రమంలో ఐదేళ్లుగా సమ్మన్న వరంగల్‌లో ఉంటున్నాడు. కుమార స్వామి గూడూరులోనే నివాసం ఉంటున్నాడు..మంగళవారం పోలీస్‌స్టేషన్‌లో ఇరు కుటుంబాలు హాజరై తిరిగి వెళ్తుండగా.. వాగ్వాదం జరిగింది. సమ్మన్న(40), అతడి తల్లి సమ్మక్క(60), తండ్రిపై కుమార స్వామి ఇనుప రాడ్డుతో దాడి చేశాడు. ఈ ఘటనలో తల్లి, కుమారుడు అక్కడికక్కడే మృతి చెందారు. తండ్రికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు గమనించి నిందితుడిని స్తంభానికి కట్టేసి పోలీసులకు అప్పగించారు..

previous post