కరీంనగర్: తెలంగాణప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రయాణిస్తున్న కారుకు పెను ప్రమాదం తప్పింది. జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం అంబారిపేట వద్ద కారు బోల్తా పడింది..ఘటన సమయంలో విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కారులోనే ఉన్నారు. ఆయనతో పాటు కారులో ఉన్న వారికి స్వల్ప గాయాలయ్యాయి. ఎదురుగా వస్తున్న లారీని తప్పించబోయే క్రమంలో ఘటన చోటు చేసుకుంది. గాయపడిన వారిని చికిత్స కోసం కరీంనగర్ ఆస్పత్రికి తరలించారు. ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ కావడంతో స్వల్ప గాయాలయ్యాయి. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి హాస్పిటల్ వైద్యుల తో మాట్లాడారు. మెరుగైన వైద్యం కోసం లక్ష్మణ్ ను హైదరాబాద్‌కు తరలించారు..

previous post
next post