Tv424x7
Telangana

మేడారం వన దేవతలను దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి

సమ్మక్క, సారలమ్మ జాతర సందర్భంగా ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి బేగంపేట నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో మేడారం చేరుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డికి జాతర నిర్వాహకులు, మంత్రి సీతక్క ఘన స్వాగతం పలికారు..అనంతరం ఆయన మన దేవతలను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని వన దేవతలను వేడుకున్నానని పేర్కొన్నారు. ములుగు జిల్లాతో, మంత్రి సీతక్కతో తనకు ప్రత్యేక అనుబంధం ఉందని తెలిపారు. తన రాజకీయ ప్రస్థానంలో ముఖ్యమైన కార్యక్రమాలు అన్ని ములుగు నుంచే ప్రారంభించానని గుర్తు చేశారు..హాత్ సే హాత్ జోడో యాత్రను కూడా ఇక్కడి నుంచి ప్రారంభించామని తెలిపారు. మేడారం జాతర ఏర్పాట్లకు ప్రభుత్వం నుంచి రూ.110 కోట్లు మంజురు చేసామని తెలిపారు. పాలకులు ప్రజలను పీడించినప్పుడే ఎవ్వరో ఒకరు వారికి ఎదురొడ్డి నిలబడతారని పేర్కొన్నారు. సమ్మక్క, సారలక్క జాతరను జాతీయ పండుగగా ప్రకటించడం సాధ్యం కాదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పినట్టు విన్నాను. అలా అయితే కేంద్రం కుంభమేళాను జాతీయ పండుగగా నిర్వహిస్తుంది కదా అని ప్రశ్నించారు. కేంద్రం మేడారం జాతర పై వివక్ష చూపడం సరికాదన్నారు..

Related posts

రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడడంలోరాహుల్ గాంధీ విఫలం: కేటీఆర్

TV4-24X7 News

గుడ్ న్యూస్.. నేటి నుంచి అధ్యాపకుల బదిలీ.. గైడ్ లైన్స్ ఇవే

TV4-24X7 News

కాంగ్రెస్ పార్టీపై సంచలన ఆరోపణలు చేసిన మధుయాష్కీ గౌడ్

TV4-24X7 News

Leave a Comment