Tv424x7
Andhrapradesh

ఈ నెల 16న అసెంబ్లీ, లోక్ సభ అభ్యర్థులను ప్రకటించనున్న సీఎం జగన్

సీఎం జగన్ కీలక నిర్నయం తీసుకున్నారు. ఈనెల 16న ఇడుపులపాయకు సీఎం జగన్ వెళ్లనున్నారు. ఈ సందర్భంగా వైసీపీ అభ్యర్థుల తుది జాబితా విడుదల చేయనున్నారు సీఎం జగన్‌..అసెంబ్లీ, లోక్ సభ అభ్యర్థులను ప్రకటించనున్నారు సీఎం జగన్. అదే రోజు ఇచ్చాపురం కి వెళ్లి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు సీఎం జగన్‌. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేశారు వైసీపీ నేతలు, కార్యకర్తలు.కాగా, రేపు కర్నూలు, నంద్యాల జిల్లాలో సీఎం జగన్ పర్యటించనున్నారు. ఈ సందర్భంగా కర్నూలు జిల్లా ఓర్వకల్లు లో నేషనల్ లా యూనివర్సిటీకి భూమి పూజ చేయనున్నారు సీఎం జగన్. అనంతరం నంద్యాల జిల్లా బనగానపల్లిలో వైఎస్సార్ ఈబీసీ నేస్తం నిధులు విడుదల చేయనున్నారు సీఎం జగన్‌. రెడ్డి, కమ్మ, ఆర్యవైశ్య, బ్రాహ్మణ, క్షత్రియ, వెలమలతో పాటు ఇతర ఓసీ సామాజిక వర్గాలకు చెందిన మహిళలకు ఆర్థిక చేయూత అందించేందుకే వైఎస్సార్ ఈబీసీ నేస్తం పథకాన్ని అమలు చేస్తున్నారు..

Related posts

ఏపీలో దేవాదాయ శాఖలో త్వరలో 500 పోస్టుల భర్తీ: మంత్రి ఆనం

TV4-24X7 News

నేడు జగనన్న జగనన్న విద్యా దీవెన పథకం నిధుల విడుదల..

TV4-24X7 News

ప్రజలు కాంగ్రెస్ పార్టీని కోరుకుంటున్నారు

TV4-24X7 News

Leave a Comment