Congress: హైదరాబాద్: భారాసకు వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఆ పార్టీకి చెందిన చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కాంగ్రెస్‌లో చేరారు..సీఎం రేవంత్‌రెడ్డి, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి దీపాదాస్ మున్షీ వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అంతకుముందు రంజిత్‌రెడ్డి భారాసకు రాజీనామా చేశారు. ప్రస్తుత రాజకీయ పరిణామాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు..
