రైతులకు శుభవార్త.. ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం

  • ఏపీలో ధాన్యం రైతులకు కూటమి సర్కార్ శుభవార్త తెలిపింది. సోమవారం నుంచి ధాన్యం కొనుగోళ్లు ప్రారంభిస్తున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. ఈ మేరకు మంత్రి నాదెండ్ల శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు.
  • రైతులు ధాన్యం వివరాల నమోదుకు -7337359375లో వాట్సాప్‌ నంబర్‌‌ని వినియోగించుకోవాలని సూచించారు మంత్రి నాదెండ్ల మనోహర్.
  • 2025 నుంచి 2026 వరకు ఖరీఫ్‌లో 51 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలుకు నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఏపీవ్యాప్తంగా 3,013 రైతు సేవా కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. ఏపీ వ్యాప్తంగా 2,061 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ధాన్యం కొనుగోలు చేసిన తర్వాత 24 గంటల నుంచి 48 గంటల్లోపే… రైతుల ఖాతాల్లోకి ధాన్యం సొమ్ము జమయ్యేలా చర్యలు చేపట్టామని మంత్రి నాదెండ్ల మనోహర్.

Save or share this story as a newspaper-style Epaper Clip:

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *