ఉత్తమ ఉపాధ్యాయుడిగా పి. నాగరాజు

దువ్వూరు మండలానికి గర్వకారణం.. ఉత్తమ ఉపాధ్యాయుడిగా పి. నాగరాజు

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

 

దువ్వూరు: వైఎస్సార్ కడప జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు దువ్వూరు మండలం మీర్జగానపల్లె ఎంపీపీఎస్ (హెచ్.డబ్ల్యూ) పాఠశాల ఉపాధ్యాయులు పి. నాగరాజు ఎంపికయ్యారు.విద్యార్థుల సర్వతోముఖ అభివృద్ధికి అంకితభావంతో పనిచేస్తూ.. విద్యతో పాటు క్రీడలు, సృజనాత్మకత, నాయకత్వ లక్షణాలను ప్రోత్సహించినందుకు ఆయనను జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపిక చేసినట్లు తెలిపారు. గురుపూజోత్సవ వేడుకల్లో జిల్లా విద్యాశాఖ అధికారులు, ఉన్నతాధికారుల చేతుల మీదుగా నాగరాజు అవార్డు అందుకోనున్నారు.నాగరాజు ఎంపిక పట్ల దువ్వూరు మండల ఉపాధ్యాయులు, విద్యాశాఖ అధికారులు, గ్రామ ప్రజలు, విద్యార్థుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు. ఈ అవార్డు దువ్వూరు మండలానికి గర్వకారణమని పేర్కొన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *