నేడు శ్రీశైలం జలాశయానికి చేరనున్న కృష్ణమ్మ ప్రవాహం

 

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

శ్రీశైలం, జూలై 29: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో కృష్ణానది పరవళ్లు తొక్కుతూ శ్రీశైలం జలాశయం వైపు దూసుకువస్తోంది. కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్ జలాశయాలు నిండటంతో అక్కడి నుంచి భారీగా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.ఈ నీరు తెలంగాణ రాష్ట్రంలోని గద్వాల జిల్లా జూరాల ప్రాజెక్టుకు చేరగా, జూరాల జలవిద్యుత్ కేంద్రం నుంచి సుమారు 37 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. ఈ ప్రవాహం నేడు శ్రీశైలం జలాశయానికి చేరే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.ఇదిలా ఉండగా, ఆల్మట్టి, నారాయణపూర్ జలాశయాల నుంచి కలిపి 80 వేల క్యూసెక్కులకు పైగా నీటిని విడుదల చేస్తున్న నేపథ్యంలో శ్రీశైలం జలాశయంలోకి వరద ప్రవాహం క్రమంగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *