అనంతపురం, జూలై 30: అనంతపురం సబ్‌డివిజన్ నూతన డీఎస్పీగా ఎం. చంద్రశేఖర్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. మంగళగిరి నుంచి బదిలీపై వచ్చిన ఆయన స్థానిక డీఎస్పీ కార్యాలయంలో పదవీ బాధ్యతలు చేపట్టారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణకు ప్రాధాన్యత ఇస్తామని, బాధితులకు త్వరితగతిన న్యాయం అందించడమే లక్ష్యంగా పనిచేస్తామని తెలిపారు.1995 బ్యాచ్‌కు చెందిన చంద్రశేఖర్ ఉమ్మడి కడప, చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లో ఎస్‌ఐ, సీఐగా సేవలందించారు. ఇటీవల డీఎస్పీగా పదోన్నతి పొంది అనంతపురానికి బదిలీపై వచ్చారు.
Save or share this story as a newspaper-style Epaper Clip: