కమలాపురం, జూలై 30: కమలాపురం మండలం ఎర్రగుడిపాడులోని అంకాలమ్మ ఆలయంలో బుధవారం రాత్రి గుర్తుతెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. ఆలయంలోని సుమారు 70 తులాల బంగారు ఆభరణాలను దొంగలు అపహరించినట్లు స్థానికులు తెలిపారు. ఇదిలా ఉండగా, ఇటీవల కమలాపురం నగర పంచాయతీ పరిధిలోని సబ్ జైలు–పెట్రోల్ బంక్ సమీపంలో కూడా వరుసగా మూడు సార్లు దొంగతనాలకు ప్రయత్నాలు జరగడంతో ప్రజల్లో తీవ్ర భయాందోళన నెలకొంది. తరచూ రాత్రి వేళల్లో దొంగతనాలు జరుగుతుండటంతో “ఎప్పుడు, ఎక్కడ ఏం జరుగుతుందో” అనే ఆందోళనతో ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. రాత్రి పూట పోలీసుల గస్తీని మరింత పెంచి, దొంగతనాలను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
కమలాపురంలో వరుస దొంగతనాలతో ప్రజల్లో భయాందోళన
30
Jul