నామినేషన్ కార్యక్రమానికి వెళుతుండగా దాడి జరిగిందని వైసీపీ ఆరోపణలు:
వైసీపీ లోక్సభా పక్ష నేత, ఎంపీ మిథున్ రెడ్డి కాన్వాయ్పై దాడి జరిగినట్లు వైసీపీ ఆరోపిస్తోంది. నామినేషన్ కార్యక్రమానికి వెళుతుండగా కత్తులు, రాళ్లు, కర్రలతో దాడి చేశారని, ఈ ఘటనలో ఎంపీ మిథున్ రెడ్డికి గాయాలయ్యాయని పార్టీ నేతలు పేర్కొంటున్నారు.
దాడిలో సుమారు 10 వాహనాలు ధ్వంసమైనట్లు వైసీపీ ఆరోపించింది. ఈ ఘటన జరుగుతున్న సమయంలో పోలీసులు ప్రేక్షకపాత్ర వహించారని వైసీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి. నామినేషన్లు దాఖలు చేయకుండా టీడీపీ శ్రేణులు అడ్డుకుంటున్నాయని కూడా ఆరోపించాయి.
Save or share this story as a newspaper-style Epaper Clip: