కడప జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు హోంగార్డులకు గాయాలు

వేంపల్లి: కడప జిల్లాలో విధి నిర్వహణ కోసం వెళ్తున్న ఇద్దరు హోంగార్డులు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. మార్గమధ్యంలో ద్విచక్ర వాహనానికి కుక్క అడ్డుగా రావడంతో ఈ ఘటన చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. చక్రాయపేట, వేముల పోలీస్‌ స్టేషన్లలో విధులు నిర్వహిస్తున్న హోంగార్డులు రాజేంద్ర, వేమయ్య బెటాలియన్ డ్యూటీ నిమిత్తం కడపకు బైక్‌పై బయలుదేరారు. ప్రయాణ సమయంలో అకస్మాత్తుగా కుక్క అడ్డుగా రావడంతో ద్విచక్ర వాహనం అదుపుతప్పి ఇద్దరూ కిందపడిపోయారు.
ఈ ప్రమాదంలో ఇద్దరు హోంగార్డులకు గాయాలయ్యాయి. వీరిద్దరూ వేంపల్లికి చెందిన వారిగా సమాచారం. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు తెలిసింది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Oplus_131072

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Save or share this story as a newspaper-style Epaper Clip:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *