నెల్లూరు జిల్లాలో పోలీసుల మెరుపు దాడులు.. డ్రోన్ సాయంతో గంజాయి సాగు గుర్తింపు.. నలుగురు అదుపులోకి
నెల్లూరు జిల్లా: మొక్కజొన్న పంట మాటున గంజాయి సాగు చేస్తున్న వ్యవహారం నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలంలో వెలుగులోకి వచ్చింది. సుమారు రెండు ఎకరాల విస్తీర్ణంలో గంజాయి సాగు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
డ్రోన్ సాంకేతికత సాయంతో గంజాయి సాగును గుర్తించిన పోలీసులు ప్రత్యేకంగా దాడులు నిర్వహించారు. ఈ ఘటనకు సంబంధించి నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.
గంజాయి సాగు వెనుక ఉన్న వ్యక్తులు, సరఫరా మార్గాలు, అంతర్రాష్ట్ర నెట్వర్క్ వివరాలను తెలుసుకునేందుకు పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు.
గంజాయి సాగు, రవాణా, విక్రయాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని నెల్లూరు జిల్లా ఎస్పీ డా. అజిత వేజెండ్ల హెచ్చరించారు. మాదకద్రవ్యాల అక్రమ కార్యకలాపాలను అరికట్టేందుకు పోలీసు శాఖ నిరంతరం నిఘా కొనసాగిస్తుందని స్పష్టం చేశారు
Save or share this story as a newspaper-style Epaper Clip: