డ్రైవర్ అప్రమత్తతతో 33 మంది ప్రయాణికులు సేఫ్
అనంతపురం జిల్లా: పెద్దవడుగూరు మండలం మిడుతూరు వద్ద శుక్రవారం తెల్లవారుజామున హైవేపై ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి.బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు 33 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సులో షార్ట్‌సర్క్యూట్ కారణంగా మంటలు వచ్చినట్లు సమాచారం. డ్రైవర్ వెంటనే అప్రమత్తమై బస్సును నిలిపి ప్రయాణికులను సురక్షితంగా కిందకు దింపారు.ఆ తర్వాత మంటలు వేగంగా వ్యాపించడంతో బస్సు పూర్తిగా దగ్ధమైంది. ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడటంతో పెను ప్రమాదం తప్పింది.
Save or share this story as a newspaper-style Epaper Clip: