Tv424x7
Andhrapradesh

వై. ఎస్. జగన్ పలకరింపు తో పులకరించా :రెడ్యo

మీ గురించి మంచిగా విన్నా, మీకు సరైన గుర్తింపునిస్తా: వై.ఎస్.జగన్ మీ (వై. ఎస్ ) కుటుంబాన్ని ముఖ్యంగా మిమ్మల్ని ప్రగడం గా నమ్మి బేషరతుగా కడప ఎంపీ వై.ఎస్.అవినాష్ రెడ్డి, ఎమ్మెల్యే శెట్టి పల్లె రఘురామి రెడ్డి, వైసిపీ జిల్లా అధ్యక్షులు సురేష్ బాబుల ఆధ్వర్యంలో వైకాపా లో చేరానని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తో 19 వ తేది వైకాపా లో చేరిన ఏపీ ఎస్ ఆర్టీసీ మాజీ జోనల్ చైర్మన్ రెడ్యo వెంకటసుబ్బారెడ్డి అన్నారు. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ లో తన సోదరుడు వైకాపా నేత, కేసీ కెనాల్ ప్రాజెక్ట్ కమిటీ వైస్ చైర్మన్ రెడ్యo చంద్రశేఖర్ రెడ్డి తో కలిసి గురువారం వై. ఎస్. జగన్ మోహన్ రెడ్డి ని కలిశారు. ఈ సందర్బంగా మీ గురించి మంచిగా విన్నానని, మీరు కష్టించి పని చేస్తారని, మీకు సరైన గుర్తింపు ఇస్తానని, తెదేపా జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు లాగా చెప్పుడు మాటలు విని మిమ్మల్ని అగౌరవ పరచనని, పని చేసే వారిని ఆగౌర పరిచే సాంసృతి తమ కుటుంబం లో గాని, తమ పార్టీ లో గానిలేదని కష్టించి పని చేస్తే సరైన గుర్తింపు ఇస్తానని వై. ఎస్. జగన్ రెడ్యo కు తేల్చి చెప్పారు. గతం లో కాంగ్రెస్ ప్రభుత్వం వైకాపా పై ఎన్ని విమర్శలు చేసినా, అలు పెరగని పోరాటం చేసినా ఇవన్నీ మనస్సు లో పెట్టుకోకుండా వై. ఎస్. జగన్ నన్ను ఆప్యాయత గా పలకరించడం తో నేను పులకించిపోయానని రెడ్యo కుటుంబం జీవితాంతం వై. ఎస్. కుటుంబం తో ఉంటుందని రెడ్యo స్పష్టం చేశారు. పదవుల కోసమో.. పనుల కోసమో తాను వైకాపా లో చేరలేదని, వై. ఎస్ కుటుంబం పై, వై. ఎస్ జగన్ పై, ఎంపీ వై.ఎస్ అవినాష్ రెడ్డి, ఎమ్మెల్యే శెట్టిపల్లె రఘురామిరెడ్డి పై సంపూర్ణ నమ్మకం తో బేషరత్ గా వైకాపా లో చేరడం నాకు సంతోషం ఇచ్చిoదని అన్నారు. ఒక సమయం లో రాజకీయాల నుండి తప్పుకోవాలని నిర్ణయం తీసుకున్నానని కానీ ఎంపీ, ఎమ్మెల్యేల ఆహ్వానం తో వై. ఎస్. కుటుంబం పై నమ్మకం తో వైకాపా లో చేరానని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కమలాపురం ఎమ్మెల్యే రవీంద్ర నాధ్ రెడ్డి, ఆర్టీసీ చైర్మన్ దుగ్గాయపల్లె మల్లికార్జున రెడ్డి, మా ఆప్తులు వైకాపా నేత కాశీభట్ల సాయినాథ్ శర్మ, రాజోలు వీరారెడ్డి నా గురించి వై. ఎస్. జగన్ కు వాస్తవాలు చెప్పడం పట్ల రెడ్యo వారికి కృతజ్ఞతలు తెలిపారు.

Related posts

అకౌంట్లలోకి ‘చేయూత’ స్కీమ్ డబ్బులు విడుదల

TV4-24X7 News

అమరావతిలో ESI ఆస్పత్రికి కేంద్రం ఓకే!

TV4-24X7 News

సతీష్ కుటుంబానికి అండగా ఉంటాం

TV4-24X7 News

Leave a Comment