అమ్మవారి దర్శనం అనంతరం మున్సిపల్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేయనున్న వైఎస్సార్సీపీ అభ్యర్థి
ప్రొద్దుటూరు: కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ కార్యకలాపాలు ఊపందుకున్నాయి. వైఎస్సార్సీపీ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా పోరెడ్డి నరసింహారెడ్డి ఈరోజు నామినేషన్ దాఖలు చేయనున్నారు. వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆశీస్సులతో, మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్రెడ్డి మార్గదర్శకత్వంలో ఆయన అభ్యర్థిత్వం ఖరారైనట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నరు
అమ్మవారి దర్శనం అనంతరం నామినేషన్
నామినేషన్ దాఖలు చేయడానికి ముందు పోరెడ్డి నరసింహారెడ్డి స్థానిక కన్యకా పరమేశ్వరి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అనంతరం వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో కలిసి ప్రొద్దుటూరు మున్సిపల్ కార్యాలయానికి చేరుకుని రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించనున్నారు.
పార్టీ శ్రేణుల్లో సందడి
పోరెడ్డి నరసింహారెడ్డి నామినేషన్ నేపథ్యంలో వైఎస్సార్సీపీ శ్రేణుల్లో సందడి నెలకొంది. పార్టీ నాయకులు, కౌన్సిలర్లు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఉంది. పట్టణ అభివృద్ధి, ప్రజా సమస్యలు, సంక్షేమ పథకాల అంశాలను ప్రధానంగా ప్రస్తావిస్తూ ఎన్నికల ప్రచారానికి పార్టీ సిద్ధమవుతోంది.
మున్సిపల్ కార్యాలయం వద్ద భద్రత
నామినేషన్ కార్యక్రమానికి పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉండటంతో మున్సిపల్ కార్యాలయం పరిసర ప్రాంతాల్లో పోలీసులు భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు సమాచారం.
Save or share this story as a newspaper-style Epaper Clip: