బీఎస్పీ ప్రొద్దుటూరు నియోజకవర్గ నూతన కార్యవర్గం ఏర్పాటు

పాత కమిటీ రద్దు.. నూతన అధ్యక్షుడిగా తాళ్లామాపురం కమాల్ బాషా, ఉపాధ్యక్షురాలిగా షేక్ షబానా నియామకం

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

ప్రొద్దుటూరు: బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) ప్రొద్దుటూరు నియోజకవర్గ నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేశారు. నియోజకవర్గానికి సంబంధించిన పాత కమిటీని రద్దు చేసి, నూతన కమిటీని నియమిస్తూ పార్టీ నాయకత్వం నిర్ణయం తీసుకుంది.

ఆంధ్రకేసరి రోడ్డులోని బీఎస్పీ పార్టీ కార్యాలయంలో కడప జిల్లా అధ్యక్షుడు సగిలి గుర్రప్ప, పార్లమెంట్ ఇన్‌చార్జి డీఎస్ జయరామ్, జిల్లా కార్యదర్శి, ప్రొద్దుటూరు ఇన్‌చార్జి తీట్ల రవికుమార్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.

నూతన కార్యవర్గంలో ప్రొద్దుటూరు నియోజకవర్గ అధ్యక్షుడిగా తాళ్లామాపురం కమాల్ బాషాను, ఉపాధ్యక్షురాలిగా షేక్ షబానాను నియమించారు.

ఈ సందర్భంగా పార్టీ నాయకులు నూతనంగా నియమితులైన వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా నాయకులు బేబీ, మేరీ, మైదుకూరు అధ్యక్షుడు భాస్కర్, ప్రొద్దుటూరు ఇన్‌చార్జి తీట్ల రవికుమార్‌తో పాటు బీఎస్పీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *