రాప్తాడు పాఠశాలలో విద్యార్థినిపై దాడి.. నిందితుడు హేమంత్ అరెస్ట్!

ప్రేమను నిరాకరించిందనే కోపంతో తరగతి గదిలోకి చొరబడి దాడి.. ఇద్దరు విద్యార్థినులకు గాయాలు

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

*అనంతపురం: రాప్తాడు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదో తరగతి విద్యార్థినిపై జరిగిన దాడి ఘటనలో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. విద్యార్థిని ప్రేమను నిరాకరించిందనే కారణంతో ఈ దాడికి పాల్పడినట్లు ప్రాథమిక సమాచారం.

పోలీసుల వివరాల ప్రకారం.. శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం మండలం నాగలూరు గ్రామానికి చెందిన హేమంత్ (21) బాధిత విద్యార్థినికి సమీప బంధువు. మేనమామ వరుసకు చెందిన అతడు, విద్యార్థిని ప్రేమను అంగీకరించలేదనే కోపంతో రాప్తాడు ప్రభుత్వ పాఠశాలలోని తరగతి గదిలోకి చొరబడి చెట్లు నరికే విద్యుత్ యంత్రంతో దాడికి పాల్పడినట్లు సమాచారం.

ఈ ఘటనలో పదో తరగతి విద్యార్థిని బోయ గోపిక ముఖం, చేయి, వీపు భాగాల్లో తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను రక్షించేందుకు ప్రయత్నించిన మరో విద్యార్థిని లక్ష్మికి కూడా గాయాలయ్యాయి.

రైల్వే స్టేషన్ వద్ద నిందితుడి పట్టివేత

దాడి అనంతరం అక్కడి నుంచి పరారైన నిందితుడు హేమంత్‌ను పోలీసులు పక్కా సమాచారంతో ధర్మవరం రైల్వే స్టేషన్ వద్ద అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం గాయపడిన ఇద్దరు విద్యార్థినులకు అనంతపురం ఆసుపత్రిలో మెరుగైన వైద్యం అందిస్తున్నారు.

పాఠశాల ప్రాంగణంలోకి చొరబడి విద్యార్థినిపై దాడికి పాల్పడిన ఘటన స్థానికంగా తీవ్ర ఆందోళన కలిగించింది. విద్యార్థుల భద్రతపై తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *