దీపావళి పండుగను పురస్కరించుకుని తాత్కాలికంగా బాణసంచా దుకాణాలు ఏర్పాటు చేసుకునే వారికి ఆంధ్రప్రదేశ్ అగ్నిమాపక శాఖ కొత్త సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. దుకాణాల ఏర్పాటుకు అవసరమైన అనుమతులను సులభంగా పొందేందుకు వాట్సప్ సేవను ప్రారంభించినట్లు వెల్లడించింది.
దరఖాస్తు చేసుకోవాలనుకునే వారు ఆదివారం నుంచి 9441236448 వాట్సప్ నంబర్‌కు తమ పేరు, దుకాణం ఏర్పాటు చేయాలనుకుంటున్న చిరునామా, సమీపంలోని అగ్నిమాపక కేంద్రం వివరాలు, మొబైల్ నంబర్ పంపించాలి.
వివరాలు పంపిన అనంతరం రూ.500 చెల్లించేందుకు పేమెంట్ లింక్ వస్తుందని, ఆ లింక్ ద్వారా రుసుము చెల్లించిన తర్వాత అనుమతి పత్రాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చని శాఖ తెలిపింది.
ఈ సేవకు సంబంధించిన మరిన్ని వివరాల కోసం 9100108101 నంబర్‌ను సంప్రదించాలని అగ్నిమాపక శాఖ సూచించింది.
Save or share this story as a newspaper-style Epaper Clip: