Tv424x7
National

దిల్లీ మద్యం కేసులో ఎమ్మెల్సీ కవితకు చుక్కెదురు

దిల్లీ: దిల్లీ మద్యం కేసులో భారాస ఎమ్మెల్సీ కవితకు చుక్కెదురైంది. ఆమెకు మధ్యంతర బెయిల్‌ ఇచ్చేందుకు న్యాయస్థానం నిరాకరించింది. తన చిన్న కుమారుడికి పరీక్షలు ఉన్నందున ఈ నెల 16 వరకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని రౌస్‌ అవెన్యూలోని సీబీఐ ప్రత్యేక కోర్టులో కవిత పిటిషన్‌ దాఖలు చేశారు..దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం.. ఏప్రిల్ 4న తీర్పును రిజర్వ్ చేసింది..వాదనల సమయంలో కవిత మధ్యంతర బెయిల్‌ పిటిషన్‌ను ఈడీ వ్యతిరేకించింది. ఆమెకు బెయిల్ ఇస్తే కేసు దర్యాప్తుపై తీవ్ర ప్రభావం పడుతుందని తెలిపింది. సాక్ష్యాలు, ఆధారాలను తారుమారు చేసే అవకాశం ఉందని పేర్కొంది. ఇప్పటికే అప్రూవర్‌గా మారిన కొందరిని ఆమె బెదిరించారని.. అందుకు తమ వద్ద ఆధారాలు ఉన్నాయని వాదనల సందర్భంగా కోర్టు దృష్టికి తీసుకువచ్చింది. మధ్యంతర బెయిల్ పిటిషన్‌ను కొట్టివేయాలని ఈడీ కోరింది. ఈ నేపథ్యంలో మధ్యంతర బెయిల్‌ పిటిషన్‌ను తోసిపుచ్చుతూ కోర్టు తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు కవిత దాఖలు చేసిన సాధారణ బెయిల్ పిటిషన్‌పై సీబీఐ ప్రత్యేక కోర్టు ఈ నెల 20న విచారణ జరపనుంది. దిల్లీ మద్యం కేసులో ఈడీ మార్చి 15న ఆమెను అరెస్టు చేసింది. మార్చి 26 నుంచి ఆమె తిహాడ్‌ జైలులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు..

Related posts

ఆకాశంలో తిరుగుతున్న శాటిలైట్లు ఎన్నో తెలుసా..?

TV4-24X7 News

పెయిన్ కిల్లర్స్, డయాబెటిస్ సహా 35 రకాల మెడిసిన్‌పై నిషేధం, రాష్ట్రాలకు కేంద్రం ఆదేశాలు

TV4-24X7 News

ఎన్నికల వేళ తనిఖీలు..రూ.8,8889 కోట్లు సీజ్

TV4-24X7 News

Leave a Comment