Tv424x7
Telangana

మహాత్మ జ్యోతిరావు పూలే 198వ జయంతి

సిద్ధిపేట జిల్లా భారతదేశంలో సామాజిక విప్లవానికి నంది పలికినమహోన్నతుడు, పీడిత ప్రజల ఆశాజ్యోతి మహాత్మ జ్యోతిరావు పూలే 198వ జయంతి సందర్భంగా ఆ మహానీయునికి ఇవే మా ఘన నివాళులు.సిద్దిపేట జిల్లా కేంద్రంలోని (టౌన్) జ్యోతిరావు పూలే గారి విగ్రహానికి బి డి ఎస్ ఎఫ్ ఆధ్వర్యంలో  పూలమాలవేసి నివాళులర్పించడం జరిగింది.ఈ సందర్భంగా బహుజన ప్రజాస్వామ్య విద్యార్థి సమాఖ్య రాష్ట్ర ఉపాధ్యక్షులు దబ్బేట ఆనంద్ మాట్లాడుతూభారతదేశంలోని శూద్రాతి శూద్రులు (దళిత బహుజన, ఆదివాసీ గిరిజన, ముస్లిం మైనార్టీలు) బ్రాహ్మణీయ కుల వ్యవస్థలో బానిసలుగా ఉన్నారనీ, వీరు అమెరికాలోని నల్లజాతి బానిసల్లాగా ఉన్నారని చెప్పిన మొట్టమొదటి వ్యక్తి ఫూలే. అందుకే బ్రాహ్మణీయ కుల వ్యవస్థలోని బానిసత్వానికి వ్యతిరేకంగా పోరాడడమొక్కటే మన ముందున్న ప్రథమ కర్తవ్యంగా ఫూలే ప్రకటించారు.బడుగులు బానిసలుగా ఉండడానికి బ్రాహ్మణీయ దోపిడీ, అణచివేత, వివక్షలను అర్థం చేసుకోకపోవడం, అందుకు చదువు లేకపోవడమే మూలమని ఫూలే గ్రహించాడు. 1834-38 కాలంలో ఫూలే మరాఠీ పాఠశాలలో చేరి విద్యాభ్యాసం ప్రారంభించారు. శూద్రులు, అగ్రవర్ణాలకు సేవలు చేయాలేగానీ విద్య నేర్చుకోకూడదని బ్రాహ్మణులు ఆయన తండ్రి గోవిందరావును బెదిరించి ఫూలే చదువు (బడి) మానిపించారు. బ్రాహ్మణుల కుటిలోపాయాల్ని గ్రహించిన ఫూలే తన తండ్రి స్నేహితులైన ముస్లిం, క్రిస్టియన్ మతస్థులైన వారి ద్వారా లహుజీబువామాంగ్ వద్ద క్రిస్టియన్ మిషనరీ (ఇంగ్లీష్) పాఠశాలలో మళ్లీ విద్యాభ్యాసం ప్రారంభించి బ్రాహ్మణ విద్యార్థుల కన్నా ప్రతిభావంతుడయ్యాడు. ఆయన జీవితకాలం ఉన్నంతవరకు బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పాటుపడ్డారని మహనీయుల అడుగుజాడల్లో నడుస్తామని. వారి ఆశయాలను కొనసాగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో(పిడిఎమ్ ) కొమ్ము దుర్గారారామ్.గాలి రాజేష్, రాజు తదితరులు పాల్గొన్నారు.

Related posts

హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం..

TV4-24X7 News

వరంగల్ ఎంపీ అభ్యర్థిగా కడియం కావ్య

TV4-24X7 News

నేడు సూర్యాపేట జిల్లాలో గవర్నర్ పర్యటన

TV4-24X7 News

Leave a Comment