Tv424x7
Andhrapradesh

గ్యాస్ పైప్ లైన్ లీక్ భారీగా ఎగిసిపడిన మంటలు

ముదినేపల్లి: ఏలూరు జిల్లా ముదినేపల్లి మండలం పెనుమల్లిలో గ్యాస్‌ పైపులైన్‌ లీకైంది. ప్రధాన రహదారి వెంబడి లీకవడం.. సమీపంలో వేసిన చెత్తకు నిప్పు అంటుకోవడంతో భారీగా మంటలు ఎగసిపడ్డాయి..సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. రోడ్డుకు ఇరువైపులా వాహనాల రాకపోకలను నిలిపివేశారు. ఇటీవల పెరికెగూడెం నుంచి డోకిపర్రు వరకు కేవలం రెండు అడుగుల లోతులోనే పైపు లైన్‌ ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో గ్యాస్‌ లీక్‌ కావడంతో ప్రమాదం జరిగింది. కైకలూరు అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను ఆర్పివేశారు..

Related posts

విజయసాయిరెడ్డి తో వాసుపల్లి కలయిక

TV4-24X7 News

*ఏపీలో నేటి నుంచి ఉచిత ఇసుక పాలసీ అమలు….

TV4-24X7 News

కృష్ణాబోర్డుకు ప్రాజెక్టులు అప్పగిస్తే తెలంగాణకు నష్టం: కేసీఆర్‌

TV4-24X7 News

Leave a Comment