టీడీపీ – జనసేన – బీజేపీ పార్టీల పొత్తులలో బాగంగా టీడీపీ 144 అసెంబ్లీ స్థానాలకు గాను, 17 ఎంపీ స్థానాలకు గానూ అభ్యర్ధులను ప్రకటించిన విషయం తెలిసిందే. ఐతే 144 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన తర్వాత టిక్కెట్ దక్కని నాయకులు చాలా చోట్ల అసహనం వ్యక్తం చేస్తున్నారు.ఈ రోజు విజయవాడలో 144 అసెంబ్లీ స్థానాలకు, 17 ఎంపీ స్థానాలకు గానూ అభ్యర్ధులకు బీ ఫారం ఇవ్వనున్న నారా చంద్రబాబు నాయుడు. 144 అసెంబ్లీ స్థానాల్లో 4 స్థానాలకు మాత్రం అభ్యర్థులను మారుస్తున్న నారా చంద్రబాబు నాయుడు. అందులో భాగంగా1) పాడేరు – గిడ్డి ఈశ్వరి2) ఉండి – రఘు రామ కృష్ణం రాజు3) మడకశిర – ఎం ఎస్ రాజు4 ) మాడుగుల – బండారు సత్యన్నారాయణఇవి కాకుండా ఇంకా కూటమి పొత్తుల్లో బాగంగా మరో రెండు స్థానాల్లో కూడా సందిగ్ధత కొనసాగుతుంది. వాటి వివరాలు.1) అనపర్తి2) దెందులూరు
