Tv424x7
Andhrapradesh

ఇతర సిరా ద్వారా ఓటర్ల వేళ్లపై మార్కు చేస్తే కఠిన చర్యలు : ముఖేష్ కుమార్ మీనా

చెరగని సిరా ద్వారా ఇంటి వద్దే మార్కు చేస్తున్నట్టుగా సామాజిక మాధ్యమాల్లో ప్రచారంపై సీఈవో ముఖేష్ కుమార్ మీనా స్పందించారు. చెరగని సిరా ఇతరులకు అందుబాటులో ఉంటుందనేది తప్పుడు ప్రచారం అని ఎంకే మీనా స్పష్టం చేశారు. ఇతర సిరా ద్వారా ఓటర్ల వేళ్లపై మార్కు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ తరహా ప్రచారం సరికాదన్నారు. చెరగని సిరా ప్రభుత్వం మాత్రమే తయారు చేస్తుందని వెల్లడించారు. ఈ సిరా భారత ఎన్నికల సంఘం వద్ద మాత్రమే అందుబాటులో ఉంటుందని తెలిపారు. ఈ సిరా భారతీయ ఎన్నికల సంఘం వద్ద కాకుండా ఇతరులు ఎవరికైనా అందుబాటులో ఉంటుందనేది తప్పుడు ప్రచారమే అని తేల్చిచెప్పారు. ఎవరైనా ఇతర సిరాల ద్వారా చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Related posts

గుంటూరులో లైవ్ న్యూడ్ స్ట్రీమింగ్ ముఠా అరెస్ట్: ఐజీ రవికృష్ణ

TV4-24X7 News

పట్టుదలతో పరీక్షలకు సిద్ధం కావాలి

TV4-24X7 News

పోలింగ్ నిర్వహణకు సన్నద్ధం: ముఖేశ్​ కుమార్​ మీనా

TV4-24X7 News

Leave a Comment