కడప /రాజంపేట మండలం లక్షుమ్పల్లెలో టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య మంగళవారం రాత్రి జరిగిన ఘర్షణలో ఇద్దరికి గాయాలయ్యాయి. వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. టీడీపీకి చెందిన మహేష్ అనే వ్యక్తి తలపై తీవ్ర గాయాలయ్యాయి. అతడిని తిరుపతికి తరలించారు. వైసీపీకి చెందిన పెంచలయ్యకు గాయాలవ్వగా, ఆయన రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

previous post
next post