కడప: ఉమ్మడి జిల్లాలో చికెన్ ధరలు అమాంతం పెరిగిపోయాయి. ఉత్పత్తి తగ్గిపోవడం, కొనుగోళ్లు పెరగడం ధరల పెరుగుదలకు కారణమైంది. కడుపు నిండా చికెన్ తినాలంటే జేబు కాస్త ఖాళీ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చేసింది. గత వారం వరకు కిలో చికెన్ రేటు 250-280 రూపాయల మధ్య ఉండగా.. ఇప్పుడు మరింత పెరిగి కిలో ఏకంగా 300 రూపాయలు పలుకుతోంది. మరో 15 రోజులు ఇదే పరిస్థితి ఉంటుందని వ్యాపారులు అంటున్నారు.

previous post