Tv424x7
AndhrapradeshTelangana

తిరుమలలో మనమడి గుండు మొక్కు తీర్చుకున్న సీఎం రేవంత్ రెడ్డి

తిరుపతి:మే 22తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి కుటుంబసభ్యులతో కలిసి బుధవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌ దగ్గర సీఎం రేవంత్‌రెడ్డి కుటుంబసభ్యులకు టీటీడీ అధికారులు స్వాగతం పలికారు..అనంతరం.. కుటుంబస భ్యులతో కలిసి స్వామి వారిని దర్శించుకున్నారు తర్వాత మనమడికి గుండు కొట్టించి మొక్కు చెల్లించు కున్నారు. రంగనాయకుల మండపంలో రేవంత్‌ కుటుంబానికి వేద పండి తులు ఆశీర్వచనం చేయగా.. టీటీడీ ఈవో ధర్మారెడ్డి తీర్థ ప్రసాదాలు అందజేశారు. తెలంగాణ సీఎంగా బాధ్య తలు చేపట్టాక.. తొలిసారి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు రేవంత్‌రెడ్డి..స్వామివారిని దర్శించుకున్న అనంతరం రేవంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. ”కాంగ్రెస్‌ పాలనలో తెలం గాణ రాష్ట్ర రైతులు సంతోషంగా ఉన్నారు. రాష్ట్రంలో నీటి సమస్యలు తీరి సకాలంలో వర్షాలు కురిశాయి. ఏపీలో ఏర్పడే ప్రభుత్వంతో సత్సంబంధాలు ఉండాలని కోరుకుంటున్నా. తెలుగు రాష్ట్రాల ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ప్రార్థించా. స్వామి వారి ఆశీస్సులతో తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి చెందాలి” అని రేవంత్‌రెడ్డి ఆకాంక్షించారు..

Related posts

ధర్నాచౌక్‌లో PET అభ్యర్థుల ధర్నా.

TV4-24X7 News

నిమజ్జనానికి పేరుకుపోయిన వ్యర్థాలు ఎన్ని టన్నులో తెలుసా?

TV4-24X7 News

ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై నేడు హైకోర్టు లో విచారణ

TV4-24X7 News

Leave a Comment