రెండు గ్రామాల మధ్య నాలుగేళ్లుగా భూ వివాదాలు-ఆ గ్రామాలపై వెళ్లడంతో సిఎస్ ను ఇరికించే ప్రయత్నం విశాఖపట్నం మే 31:సిఎస్ జవహర్ రెడ్డిపై జనసేన కార్పొరేటర్ చేసిన ఆరోపణలు అవాస్తవమని తేలిపోయింది. విశాఖ పార్లమెంట్ స్వతంత్ర అభ్యర్థి దేవర శంకర్ పై చేసిన దాడి నుంచి ద్రుష్టి మరల్చడానికి రాష్ట్ర ప్రధనకార్యదర్శి పైనే బురదజల్లే ప్రయత్నం జరుతున్నట్టు తెలుస్తోంది. సిఎస్ పై ఆరోపణలు ఆధారాలతో నిరూపిస్తానని మీడియా ముందు బీరాలు పలికిన పీతల మూర్తి శుక్రవారం టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బొక్క బోర్లా పడ్డారు. బాధితులుగా తీసుకొచ్చిన రైతులు చిట్టెమ్మ, అప్పన్న, నారాయణ తదిరులు తమ భూములను ఎవరికి అగ్రిమెంట్లు చేయలేదని స్పష్టం చేశారు. దీంతో సిఎస్, ఆయన కుమారుడు 800 ఎకరాలు బలవంతంగా రాయించున్నారనే ఆరోపణ అవాస్తవమని తేలిపోయింది. అంతేకాకుండా అన్నవరం పంచాయితీ సర్పంచ్ ఎల్లాజి, లక్ష్మణరావు, తమ ఊరు పెద్దలు కలిసి తమ భూములను ఇచ్చేయాలని బెదిరింపులకు పాల్పడుతున్నట్లు తెలిపారు. నాలుగేళ్లుగా రెండు పంచాయితీల మధ్య భూ వివాదాలు జరుగుతున్నాయని చెప్పారు. వాళ్ళే రెవిన్యూ అధికారులతో వచ్చి సిమెంట్ దిమ్మలు వేస్తే అడ్డుకున్నమన్నారు. అయితే పీతల మూర్తి అవే వీడియోలు చూపించి సిఎస్ ఆయన కుమారుడు బెదిరిస్తున్నారని మీడియా ప్రతినిధులకు పక్కదోవ పట్టించేందుకు ప్రయత్నించడం విశేషం. అంతే కాకుండా రైతులు మాట్లాడుతుంటే సిఎస్ పేరు చెప్పాలని సూచించడం గమనార్హం. జవహర్ రెడ్డి పేరు కూడా తెలియని రైతులు జవర్ అని తడబడ్డారు. భోగాపురం విమానాశ్రయం పనులు పరిశీలించడానికి అన్నవరం గ్రామం మీదుగా సిఎస్ ప్రయాణించారు. రైతులు కూడా అదే చెప్పారు. భోగాపురం వెళ్ళినపుడు మా భూముకున్న రోడ్డులో ప్రయాణించారని తెలిపారు. సిఎస్ భూములు చూసారన్నా విలేకరుల ప్రశ్నకు బదులిస్తూ కార్లలో వెళ్లిపోయారని చెప్పారు. సిఎస్ భోగాపురం వెళ్ళడమే తప్పుగా పీతల మూర్తి ఆయనపై తీవ్ర ఆరోపణలు చేసి రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని అర్థమవుతోంది. జూనియర్ ఆర్టిస్టులకు ట్రైనింగ్ ఇచ్చి తెచ్చినట్టు విలేకరుల సమావేశంలో రైతులు మాట్లడంతో ఇదంతా మూర్తి యాదవ్ సెటప్ గా కొందరు మీడియా ప్రతినిధుల జోకులు వేసుకోవడం గమనార్హం.

next post