Tv424x7
Andhrapradesh

కాశీ పుణ్యక్షేత్రం దర్శించుకుని వచ్చిన సందర్భంగా పేదలకు అన్నదానం, వస్త్ర దానం కార్యక్రమం

విశాఖపట్నంశ్రీ స్వామి వివేకనంద సంస్థ వారు, సంస్థ సభ్యులు కాల భైరవ స్వామి ఆలయం, కాశీ పుణ్యక్షేత్రాన్ని, కాశి అన్నపూర్ణేశ్వరి, కాశీ విశాలాక్షి, త్రివేణి సంగమం, అయోధ్యాలను దర్శించుకుని వచ్చిన సందర్భంగా, వివేకానంద సంస్థ నందు కాలభైరవ స్వామి కి ప్రత్యేక పూజలు నిర్వహించి, పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ జహీర్ అహ్మద్ విచ్చేసి, పేదలకు, వస్త్ర దానం నిర్వహించారు. భోజనాలకు విచ్చేసిన మహిళలకు సంస్థ మహిళా సభ్యులు తాంబూలాలు అందించి, వారి ఆశీర్వాదం తీసుకున్నారు. కాశీ అన్నపూర్ణేశ్వరి ఆశీస్సులతో వివేకనంద సంస్థ నందు నిత్య అన్నదానాలు జరుగుతుంటాయని సంస్థ అధ్యక్షులు అప్పారావు తెలియజేశారు. కార్యక్రమంలో సంస్థ సభ్యులు పాల్గొన్నారు.

Related posts

ఏపీ సీఎస్, డీజీపీలకు ఎలక్షన్ కమిషన్ సమన్లు

TV4-24X7 News

ఏపీకి వాయుగుండం ముప్పు.. రాబోయే 24 గంటల్లో భారీ వర్షాలు!

TV4-24X7 News

భారీ విగ్రహాలు పెడితే కడుపు నిండదు.. గణతంత్ర వేడుకల్లో సర్కార్‌పై షర్మిల విసుర్లు

TV4-24X7 News

Leave a Comment