ఏపీ : ఈవీఎం లను ట్యాంపరింగ్ చేసి చంద్రబాబు గెలిచారని జగన్ మేనమామ, కమలాపురం మాజీ MLA రవీంద్రనాథ్ రెడ్డి ఆరోపించారు. ‘సింగపూర్లో కూర్చొని టెక్నికల్గా ట్యాంపరింగ్ చేశారు. బార్కోడ్ల ద్వారా ఇలా చేశారని అనుమానిస్తున్నాం. త్వరలోనే దీనిపై క్లారిటీ వస్తుంది. చంద్రబాబు వ్యవస్థలను మేనేజ్ చేసి ఇదంతా నడిపించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ స్కామ్ జరిగింది. దీనిపై త్వరలోనే కోర్టుకు వెళ్తాం’ అని ఆయన స్పష్టం చేశారు.